సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని 'హీ ఈజ్ సో క్యూట్' పాట ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మహేశ్ కుమార్తె సితార ఈ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసింది. కథానాయిక రష్మిక స్టెప్పులు కాపీ చేసి.. అచ్చం అలానే దించేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సితార ఇలా సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో 'బాహుబలి'లోని 'ముకుంద', 'మహర్షి' సినిమాలోని 'పాలపిట్ట' పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకుంది.