తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇష్క్​'.. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి! - ప్రియా ప్రకాష్​ వారియర్ వార్తలు

యువ కథానాయకుడు తేజా సజ్జా, ప్రియా ప్రకాశ్​ వారియర్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఇష్క్​'. ఏప్రిల్​ 23న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది.

teja sajja new movie ishq press meet
'ఇష్క్​'.. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి!

By

Published : Apr 16, 2021, 6:31 AM IST

ఆ రోజు ఆ అమ్మాయి పుట్టినరోజు. రాత్రి కారులో ఆ అమ్మాయి.. ఓ అబ్బాయి. ఆ కారేమో బీచ్‌ రోడ్డులో! మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే 'ఇష్క్‌' చూడాల్సిందే. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియా ప్రకాశ్​ వారియర్‌ కథానాయిక. యస్‌.యస్‌.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకులు. ఏప్రిల్​ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను కథానాయకుడు సాయి తేజ్‌ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది.

కథానాయకుడు తేజ సజ్జా మాట్లాడుతూ.. "ఇదొక కొత్త రకం కథ. 'జాంబీరెడ్డి' తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కొంత విరామం తర్వాత మెగా సూపర్‌ గుడ్‌ సంస్థ నాతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదే పేరుతో నితిన్‌ సినిమా చేశారు. 'మీ సినిమా పేరు వినియోగిస్తున్నాం' అనగానే నితిన్‌ సరే అనడం సహా.. ఇందులోని 'ఆనందం..' పాటనూ విడుదల చేశార"న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. "ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వల్లే నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాను 29 రోజుల్లో ఇంత నాణ్యంగా పూర్తి చేయడానికి కారణం నిర్మాతలు, ఛాయాగ్రాహకుడు శ్యామ్‌ కె.నాయుడు. తేజ, ప్రియా, తమిళ నటుడు రవీందర్‌తోపాటు చిత్రబృందం అంతా చక్కటి సహకారం అందించింది. మహతి మంచి సంగీతం అందించార"న్నారు. ఈ కార్యక్రమంలో వాకాడ అప్పారావు, జెమినీ కిరణ్‌, బెక్కం వేణుగోపాల్‌, మహతి స్వరసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అమెరికాలోనూ 'వకీల్​సాబ్'​ వసూళ్ల హవా!

ABOUT THE AUTHOR

...view details