బాలీవుడ్ తారలు తాప్సీ పన్ను, కంగనా రనౌత్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. నెపోటిజమ్‌పై తన అభిప్రాయాలు పంచుకుంది. ఆమె తన గతాన్ని మర్చిపోయి, ఓ ముఠాతో కలిసి కంగనపై విమర్శలు చేస్తోందని.. టీమ్ కంగనా రనౌత్ ఆరోపించింది. ట్విట్టర్లో తాప్సీని ట్యాగ్ చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.
"చాలా మంది కంగన చేసే పనుల్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినీ మాఫియాతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కంగనపై మాటల దాడి చేస్తే వారికి సినిమాలు, అవార్డులు దక్కుతాయి. ఈ క్రమంలోనే బహిరంగంగానే వేధింపులకు పాల్పడతారు. సిగ్గుచేటు తాప్సీ. మీరు కంగనా కృషితో లాభం పొందుతారు. కానీ ఆమెపైనే విమర్శలు చేస్తారు"
టీమ్కంగనా రనౌత్
తాప్సీ ఈ ఆరోపణలపై నేరుగా స్పందించలేదు. అయితే, టోనీ గాస్కిన్స్ కోట్స్‌ను జోడిస్తూ.. ట్విట్టర్లో వీటికి బదులిచ్చింది.