తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2019, 9:06 PM IST

ETV Bharat / sitara

హిందీ 'టాక్సీవాలా' తూచ్‌.. ఇదుగో క్లారిటీ..

బాలీవుడ్​  యంగ్​ హీరో ఇషాన్‌ ఖత్తర్​ ప్రస్తుతం తెలుగులో వచ్చిన 'టాక్సీవాలా'కు రీమేక్​ 'కాలీ పీలి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది నిన్నటి దాకా అందిన సినీ వర్గాల సమాచారం. అయితే ఇదంతా నిజం కాదని తేలింది.

బాలీవుడ్​లో టాక్సీవాలా రీమేక్​ డూబ్​ అంట...!

బాలీవుడ్​ హీరో 'షాహిద్​ కపూర్'​ తమ్ముడు 'ఇషాన్​ ఖత్తర్' తెలుగులో వచ్చిన 'టాక్సీవాలా'కు రీమేక్‌ 'కాలీ పీలీ' చిత్రం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లోని ఓ బడా నిర్మాత ఈ సినిమా రీమేక్‌ హక్కులను కొనుగోలు చేశారని, ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా దీన్ని పునర్నిర్మిస్తోన్నట్లు సమాచారం అందింది. ఇదంతా వాస్తవం కాదంటూ 'టాక్సీవాలా' చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌ క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపాడు.

"టాక్సీవాలా హిందీ రీమేక్‌ హక్కుల గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ మేం ఆ హక్కులను ఇంకా ఎవరికీ అమ్మలేదు. ఇప్పటికీ అవి మా చేతుల్లోనే ఉన్నాయి."

-టాక్సీవాలా నిర్మాత. ​

ఇటీవలే ఇషాన్​ ఖత్తర్​ 'సైరత్'​ అనే మరాఠి చిత్రాన్ని 'ధఢక్​'గా రీమేక్ చేసి ​ ప్రేక్షాదరణ పొందాడు. విజయ్‌ దేవరకొండ - ప్రియాంక జంటగా నటించిన 'టాక్సీవాలా' తెలుగులో గతేడాది విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది.

ఇదీ చూడండి : 'గీతాగోవిందం'కు నో..'టాక్సీవాలా'కు ఓకే

ABOUT THE AUTHOR

...view details