తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటర్​గా మారిన తాప్సీ..! - bhumi padnekar

పింక్ భామ తాప్సీ పన్ను, 'దమ్ లగా కే ఐసా'తో గుర్తింపు పొందిన భూమి పడ్నేకర్ షూటర్స్​గా కనిపించనున్నారు.

షూటర్​ పాత్రలో తాప్సీ

By

Published : Feb 9, 2019, 5:30 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మలు తాప్సీ, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే బయోపిక్ డ్రామా"షాంద్ కీ ఆంక్". ప్రపంచంలోనే అత్యంత పురాతన షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.

కొత్త దర్శకుడు తుషార్ హిరనందాని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్స్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మర్, చల్లాక్ ఎన్ చీజ్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఉత్తరప్రదేశ్​లోని మీరట్​లో వచ్చే వారం నుంచి ఈ చిత్ర షూటింగ్​ ప్రారంభం కానుంది.

సినిమాలో నటించే కథానాయికలిద్దరూ తమ శక్తివంచన మేర కృషి చేస్తున్నారు. వారిద్దరి నటనను బయటపెట్టేందుకు ఇది సరైన చిత్రం--దర్శకుడు తుషార్


ABOUT THE AUTHOR

...view details