తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Vijay Thalapathi: రికార్డుల 'మాస్టర్'.. బాక్సాఫీస్ బ్లాక్​బాస్టర్

నేడు (మంగళవారం) తమిళ స్టార్​ హీరో విజయ్​ దళపతి పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు సహా పలువురు సినీప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన కెరీర్​ గురించి పలు విశేషాలు మీకోసం..

vijay
విజయ్​

By

Published : Jun 22, 2021, 12:00 PM IST

Updated : Jun 22, 2021, 1:58 PM IST

డ్యాన్స్​లు, పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించగల మాస్​హీరో, తనదైన శైలి నటనతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న​ స్టార్​, కోలీవుడ్​లో రజనీకాంత్​ తర్వాత స్టైల్​కు కేరాఫ్ అడ్రస్​.. ఇదంతా ఎవరి గురించో అర్థమైందిగా. అతడే ప్రముఖ కథానాయకుడు విజయ్​ దళపతి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్​కు తమిళనాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్​ ఉన్నారు. ఆయన సినిమా విడుదలైందంటే అభిమానులకు పండగే. బక్సాఫీస్​ వద్ద రికార్డుల సందడే. మంగళవారం(జూన్​ 22) దళపతి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..

విజయ్​

సినీ నేపథ్యం

విజయ్​ తండ్రి చంద్రశేఖర్​ ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే 1984లో 'వెట్రి' సినిమాతో బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేశారు విజయ్. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించారు. 1992లో విడుదలైన 'నాలయ తీర్పు' సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. 1996లో రిలీజ్​ అయిన 'పూవే ఉనక్కగా'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా అప్పటి నుంచి ఎన్నో హిట్​ సినిమాల్లో నటించారు. 'పెళ్లి సందడి', 'అతనొక్కడే', 'బద్రి', 'ఒక్కడు', 'ఖుషీ', 'తమ్ముడు', 'పోకిరి' వంటి ఎన్నో తెలుగు హిట్​ సినిమాలను రీమేక్​ చేసి విజయం సాధించారు. త్వరలోనే నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వంలో 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

విజయ్​

రూ.100కోట్లకు పైగా వసూలు

ఇటీవల కాలంలో విజయ్ నటించిన పలు సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేశాయి. అందులో 'మాస్టర్'​, 'బిగిల్'​, 'మెర్సల్'(అదిరింది)​, 'సర్కార్'​, 'తేరి'(పోలీసోడు) వంటివి ఉన్నాయి.

ఆస్తి విలువ

భారతీయ చిత్రసీమలోని సంపన్న నటులలో విజయ్​ దళపతి ఒకరు. ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం రూ.410కోట్లు అని సమాచారం. 2019నుంచి ఆయన ఏడాదికి రూ.100-120కోట్లు సంపాదిస్తున్నారని తెలిసింది. విజయ్ పలు చిత్రాల్లో నటిస్తూనే బ్రాండ్​ అంబాసిడర్​గానూ సత్తా చాటుతున్నారు. కోకా కోలా, ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ సహా పలు సంస్థలకు బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ.10కోట్ల వరకు ఆర్జిస్తున్నారు.

విజయ్​

రికార్డు పారితోషికం

భారీ రెమ్యునరేషన్​ తీసుకునే నటుల్లో ఒకరిగా విజయ్​ ఎదిగారు. ఇటీవల 'మాస్టర్​' సినిమాతో సూపర్ హిట్​ అందుకున్న ఆయన.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్​కుమార్​ దర్శకత్వంలో 'బీస్ట్​' చిత్రంలో నటిస్తున్నారు. ఇందుకోసం రూ.100కోట్ల రెమ్యునరేషన్​ తీసుకున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సన్​ పిక్చర్స్​ నిర్మిస్తుంది. అనిరుధ్​(Anirudh Ravichander) స్వరాలు సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయిక. విలన్​ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు విద్యుత్​ జమ్వాల్​(Vidyut Jammwal)ను ఎంపిక చేసినట్లు సమాచారం.

బీస్ట్​

విజయ్​తో దిల్​రాజు భారీ ప్లాన్​

దలపతి విజయ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'స్నేహితుడు' తర్వాత ఆయన సినిమాలు దాదాపుగా తెలుగులో డబ్ అవుతూ, సినీ అభిమానుల్ని అలరిస్తూ వచ్చాయి. ఈ ఏడాది 'మాస్టర్​'(Master) అంటూ వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అయితే దిల్​రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన స్ట్రెయిట్​ తెలుగు చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపారు. రూ.170కోట్ల భారీ బడ్జెట్​తో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్రబృందం త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.

ఖరీదైన కార్లు

విజయ్​కు కార్లంటే కూడా విపరీతమైన ఇష్టం!. ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రోల్స్​ రాయిస్​ ఘోస్ట్​(రూ.6కోట్లు), ఆడీ ఏ8(రూ.1.30కోట్లు), బీఎమ్​డబ్ల్యూ సిరీస్​5(రూ.75లక్షలు), బీఎమ్​డబ్ల్యూ ఎక్స్​6(రూ.90లక్షలు), మినీ కూపర్​(రూ.35లక్షలు) ఉన్నాయి.

64 సినిమాలు

విజయ్​ ఫ్యాన్స్​.. సోషల్​మీడియాలో ఆయన కామన్​ డీపీ, ఫ్యాన్​ మేడ్​ పోస్టర్లతో, ట్వీట్​లతో ట్రెండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెవెన్​ స్క్రీన్​ స్టూడియో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటించిన 64 సినిమాలు సహా రాబోతున్న కొత్త చిత్రం పోస్టర్​తో కలిపి ఓ పోస్టర్​ను తయారు చేసింది. అది నెట్టింట్లో ట్రెండింగ్​గా​ మారింది.

విజయ్​ దళపతి

ఇదీ చూడండి: Vijay 65: విజయ్​ 'బీస్ట్​'​లుక్​ వచ్చేసిందోచ్​!

Last Updated : Jun 22, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details