తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటి "ఐశ్వర్య"కి జ్వరమొస్తే... రూ.లక్ష బిల్లేశారట! - 'మేయ్'

తమిళ కథానాయిక ఐశ్వర్య రాజేశ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ సినిమా 'మేయ్'.  వైద్య వృత్తిలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కథానాయకుడిగా నిక్కీ సుదర్శన్​ నటిస్తున్నాడు. ఎస్​.ఎ. భాస్కరన్​ దర్శకత్వం వహిస్తున్నాడు. ​ఈ చిత్ర ప్రమోషన్స్​లో ఐశ్వర్య అందరూ ఆశ్చర్యపోయే ఓ విషయాన్ని పంచుకుంది.

జ్వరానికి రూ.లక్ష బిల్లు వేశారు: ఐశ్వర్య

By

Published : Aug 22, 2019, 12:36 PM IST

Updated : Aug 22, 2019, 1:09 PM IST

తమిళ కథానాయిక ఐశ్వర్య రాజేశ్ నటించిన మేయ్​ చిత్ర ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘'ఇటీవల నాకు సాధారణ జ్వరం వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. వైద్యులు ఖరీదైన పరీక్షలు చేయించుకోవాలని చెప్పి, నన్ను వార్డులో చేర్చారు. తర్వాతి రోజు డిశ్చార్జ్‌ చేయమని అడిగితే... ఆదివారం డిశ్చార్జ్‌ చేయబోమని వైద్యులు అన్నారు. నాకు కోపం వచ్చింది. కేవలం కొన్ని పరీక్షలు చేసినందుకు రూ.లక్ష బిల్లు వేశారు. దాన్ని చూసి షాక్‌ అయ్యా. మరోదారిలేక బిల్లు కట్టాను. జ్వరం తగ్గడానికి సాధారణంగా వాడే డోలో మాత్రలు ఇచ్చి పంపారు.'’ అని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

ఐశ్వర్య కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తెలుగులో నేరుగా నటించిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్‌, ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించింది. తమిళ హీరో శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో కనిపించనుడు. ఆగస్టు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Last Updated : Aug 22, 2019, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details