తెలంగాణ

telangana

ETV Bharat / sitara

14 వేల మంది సినీ కార్మికులకు ఆసరాగా తలసాని ట్రస్ట్​

కరోనా లాక్​డౌన్​ వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు ఆసరాగా తలసాని ట్రస్ట్​ నిలిచింది. దాదాపు 14 వేల మంది కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.

Talasani Trust, which supports the families of 14,000 film workers
14 వేల మంది సినీ కార్మికులకు ఆసరాగా తలసాని ట్రస్ట్​

By

Published : May 28, 2020, 2:05 PM IST

లాక్​డౌన్ వల్ల ఉపాధికి దూరమైన తెలుగు సినీ కార్మికులకు తలసాని ట్రస్ట్ ఆసరాగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో 14 వేల మంది కార్మిక కుటుంబాల కడుపు నింపేందుకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా క్రైసిస్ కమిటీ సభ్యులు ఎన్.శంకర్, సి.కల్యాణ్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తలసాని ట్రస్ట్​ వ్యాన్​
వేదికపై తలసాని శ్రీనివాస్​ యాదవ్​, నాగార్జున, రాజమౌళి

కథానాయకుడు నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, రాధాకృష్ణ, అభిషేక్ అగర్వాల్, ఎఫ్​డీసీ మాజీ ఛైర్మన్ రాంమోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై సినీకార్మిక సంఘాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. తలసాని ట్రస్ట్ నిర్వాహకులతో పాటు కరోనా క్రైసిస్ కమిటీ సభ్యులను అభినందించారు. ఇవే కాకుండా అవసరమైన మేర మరిన్ని కిట్లను సరఫరా చేయనున్నట్లు తలసాని కుమారుడు సాయి వెల్లడించారు.

సరుకులు అందజేస్తున్న రాజమౌళి
త్రివిక్రమ్ శ్రీనివాస్
కొరటాల శివ
నాగార్జున
దిల్ రాజు

ఇదీ చూడండి... డెలివరీ 'లేడీ'​గా మారిన ప్రముఖ పాప్​ సింగర్​!

ABOUT THE AUTHOR

...view details