తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిర్మాతగా​ తాప్సీ.. 'అధికారమ్​' కోసం థమన్​ - sammathame first look

చిత్రసీమలో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'డియర్​ మేఘ' లిరికల్​ వీడియోతో పాటు 'సమ్మతమే' ఫస్ట్​లుక్​, తాప్సీ నిర్మాణసంస్థ, లారెన్స్​ 'అధికారమ్​' సినిమా అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Taapsee Pannu's Production House Outsiders Films - Thaman as Adhigaram Movie Music Director
నిర్మాతగా హీరోయిన్​ తాప్సీ.. 'అధికారమ్​' కోసం థమన్​

By

Published : Jul 15, 2021, 1:30 PM IST

మేఘా ఆకాశ్ హీరోయిన్​గా 'డియర్ మేఘ' అనే చిత్రం తెరకెక్కుతోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్​లుక్​ ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ సినిమాలోని 'ఆమని ఉంటే' లిరికల్​ సాంగ్​ను శుక్రవారం ఉదయం 10.18 గంటలకు స్టార్​ హీరోయిన్​ పూజా హెగ్డే చేతుల మీదుగా రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్​ను త్వరలోనే ప్రకటించనున్నారు.

'డియర్​ మేఘ' లిరికల్​ సాంగ్​ రిలీజ్​ పోస్టర్​

థమన్​ మ్యూజిక్​

ప్రముఖ కొరియోగ్రాఫర్​ లారెన్స్​ హీరోగా నటిస్తున్న కొత్త తమిళ చిత్రం 'అధికారమ్​'. దురయి సెంథిల్​ కుమార్​ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని వెట్రిమారన్​ నిర్మిస్తున్నారు. పాన్​ఇండియా స్థాయిలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్​.ఎస్​.థమన్​ను ఎంపిక చేసింది చిత్రబృందం.

లారెన్స్​ 'అధికారమ్​' సినిమా కోసం థమన్​

నిర్మాతగా తాప్సీ

ప్రముఖ బాలీవుడ్​ నటి తాప్సీ నిర్మాతగా మారనుంది. ఆమె నటించిన 'సూర్మా', 'పీకూ' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రాంజల్ ఖాంద్డీయాతో కలిసి 'అవుట్​సైడర్స్ ఫిలిమ్స్​' అనే నిర్మాణసంస్థను ప్రకటించింది. ఈ సంస్థలో రూపొందనున్న తొలి చిత్రం 'బ్లర్​'ను జీ స్టూడియోస్​తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు ట్విట్టర్​లో తాప్సీ ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది.

తాప్సీ నిర్మాణంలో తొలి సినిమా

'సమ్మతమే' ఫస్ట్​లుక్​

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్​ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చాందినీ చౌదరి హీరోయిన్​గా నటిస్తున్న చిత్రానికి శేఖర్​ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు. హీరో కిరణ్​ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఫస్ట్​లుక్​ను గురువారం సాయంత్రం 4.02 గంటలకు విడుదల చేయనున్నారు.

'సమ్మతమే' ఫస్ట్​లుక్​ రిలీజ్​ పోస్టర్​

ఇదీ చూడండి..ఏక్​ బార్​ ఏక్​ బార్​.. ఈ బార్బీబొమ్మకి సీటీమార్​

ABOUT THE AUTHOR

...view details