ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి తన నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తుంది బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను. తాజాగా, 'సాంఢ్ కీ ఆంఖ్' చిత్రం కోసం పరిశీలించిన తన తొలి ట్రయల్ లుక్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ. తన సినీ కెరీర్లో ఇదే అతిపెద్ద ప్రయోగం అని పేర్కొంది. ఇందులో తాప్సీ ఎప్పుడూ చూడని విభిన్న పాత్రలో ఓ వృద్ధురాలిగా కనిపించింది. ఈ క్రమంలోనే తన అనుభవాలను పంచుకుంది.
"నా కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగం ఈ పాత్ర. తొలిసారి డైరెక్టర్గా తుషార్ హీరానందాని, మొదటిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్లోనే తొలిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇందులో ఎంతో మంది మొదటిసారి సినిమా కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసి ఇది ప్రారంభీకుల అదృష్టం అనుకుంటా. 'సాంఢ్ కీ ఆంఖ్'తో నాకు ఎన్నో అనుభవాలు ముడిపడి ఉన్నాయి."