తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జీవితాంతం గుర్తుంటుందనే ఆ సినిమాలో నటించా: తాప్సీ - taapsee pannu films

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న నటి తాప్సీ.. తాను నటించిన 'మిషన్ మంగళ్' సినిమా విశేషాలను పంచుకుంది. ఈ చిత్రంలో పనిచేయడానికి గల కారణాల్ని వెల్లడించింది.

జీవితాంతం గుర్తుంటుందనే ఆ సినిమాలో నటించా: తాప్సీ
తాప్సీ

By

Published : Jul 10, 2020, 9:01 PM IST

పలు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ.. గతేడాది 'మిషన్ మంగళ్'లో నటించడానికి గల కారణాల్ని వెల్లడించింది. ఈ మేరకు ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.

తాప్సీ ఇన్​స్టాగ్రామ్ పోస్ట్

"మిషన్ మంగళ్ షూటింగ్ ప్రారంభించిన తొలి రోజుల్లో మేం చాలా ఆసక్తితో ఉండేవాళ్లం. సెట్​లో ఆనందకర వ్యక్తులే కాకుండా గర్వించదగ్గ నటీనటులు ఉన్నారు. అయితే ఈ సినిమా చేయడానికి నాకు రెండు కారణాలు ఉన్నాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని ఇస్తుందని నమ్మడం సహా ఇంత అద్భుతమైన నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం" -తాప్సీ, ప్రముఖ నటి

'మిషన్ మంగళ్'.. గతేడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ముందువరుసలో నిలిచింది. మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను పలువురు మహిళా శాస్త్రవేత్తలు ఎలా విజయవంతం చేశారనే కథతో ఈ సినిమా తీశారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్ లాంటి ప్రముఖులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటే తాప్సీ ఓ శాస్త్రవేత్తగా కనిపించింది. ప్రస్తుతం ఈ నటి.. హసీన్ దిల్​రుబా, రష్మి రాకెట్, శభాష్ మితు చిత్రాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details