తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లిపై నటి తాప్సీ రియాక్షన్.. ఏమందంటే? - తాప్సీ పన్ను భర్త

Taapsee Pannu Marriage: రెండు హిట్​లు కొట్టిన హీరోయిన్ తాప్సీ.. ఘనంగా ఈ ఏడాదిని ముగించబోతుంది. అయితే చాలాకాలంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై స్పందించింది తాప్సీ.

taapsee pannu
తాప్సీ పన్ను

By

Published : Dec 31, 2021, 12:34 PM IST

Updated : Dec 31, 2021, 3:39 PM IST

Taapsee Pannu Marriage: సినీ నటి తాప్సీ పన్ను.. 'హసీనా దిల్​రుబా', 'రష్మీ రాకెట్' చిత్రాలతో ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తాప్సీ.. తన ప్రియుడు, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోను వచ్చే ఏడాది వివాహం చేసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై తాప్సీ స్పష్టత ఇచ్చింది.

"ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాను. హడావుడిగా పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు నచ్చదు"

-తాప్సీ, నటి.

పెళ్లి విషయంపై పూర్తి క్లారిటీతో ఉన్న తాప్సీ.. ప్రశాంతమైన మూడ్​లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లి కాగానే కొత్తగా ఏమీ మార్పు రాదని అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది.

ఈ ఏడాదిలో రెండుసార్లు లాక్​డౌన్​ తరహా ఆంక్షలు విధించడంపై తాప్సీ మాట్లాడింది. లాక్​డౌన్​ ప్రభావం తనపై తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది. కుటుంబంతో గడిపేందుకు సరిగా సమయం లభించలేదని పేర్కొంది. 2022లో అయినా ప్రశాంతత దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

నాపై పుస్తకం రాస్తే.. అతడి పేరు ఉండాల్సిందే: తాప్సీ

హీరోయిన్​ తాప్సీ భర్త ఆర్మీ ఆఫీసరా!

Taapsee: గ్రహాంతర వాసుల కథలో తాప్సీ?

Last Updated : Dec 31, 2021, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details