తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్​: 'స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు' - movie

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా: నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

సైరా

By

Published : Sep 18, 2019, 5:32 PM IST

Updated : Oct 1, 2019, 2:15 AM IST

అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా: నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ విడుదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అద్భుతమైన పోరాటాలు, విజువల్స్​తో ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. చిరు తన నటనతో విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. భారత్ మాతా కీ జై అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠ గొలుపుతోంది. చివరి కోరిక ఏంటని బ్రిటీష్ అధికారి అడిగినపుడు 'గెట్ ఔట్ ఫ్రమ్​ మై మదర్​ ల్యాండ్' అంటూ మెగాస్టార్ చెప్పిన సంభాషణతో ప్రచారచిత్రం ముగిసింది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్​పై రామ్​చరణ్​ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. సురెందర్ రెడ్డి దర్శకత్వం. నయనతార కథానాయిక. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. సుదీప్, తమన్నా, జగపతిబాబు, విజయ్​సేతుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: హాస్యభరితంగా 'మేడిన్ చైనా' ట్రైలర్

Last Updated : Oct 1, 2019, 2:15 AM IST

ABOUT THE AUTHOR

...view details