తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాస్'బస్టర్​ ఇచ్చినందుకు థాంక్యూ నాన్న - ఈటీవీ భారత్​

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ప్రపంచవ్యాప్తంగా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పాజిటివ్​ టాక్​ తెచ్చుకోవడంపై తండ్రీకొడుకులిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు చరణ్.

'నా కల నిజం చేశావురా నాన్నా..'

By

Published : Oct 2, 2019, 1:29 PM IST

Updated : Oct 3, 2019, 1:18 PM IST

'సైరా నరసింహారెడ్డి'... మెగాస్టార్​ చిరంజీవి 12 ఏళ్ల కలల ప్రాజెక్టు. ఎప్పట్నుంచో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటించాలన్న చిరు కోరికను నిజం చేశాడు తనయుడు రామ్​చరణ్​. నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్​​ సొంతం చేసుకుంది. ఈ స్పందన చూసి తమ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు తండ్రీకొడుకులిద్దరు. చెర్రీని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టుకున్నాడు చిరు. ఈ ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నాడు చరణ్​.

చెర్రీని ముద్దుపెట్టుకుంటున్న చిరు

" జీవితంలో నాకు అన్నీ ఇచ్చిన వ్యక్తి ఈయనే... ఇప్పుడు 'బాస్' బస్టర్​ కూడా ఇచ్చాడు. థాంక్యూ సో మచ్​ డాడ్​" --రామ్​చరణ్​, సినీ నటుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ కీలక పాత్రలు పోషించారు. అమిత్​ త్రివేది సంగీతం అందించాడు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు.

ఇది చదవండి: రివ్యూ: మెగాస్టార్ అయ్యారు 'సైరా'

Last Updated : Oct 3, 2019, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details