తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గెట్ రెడీ.. రేపే 'సైరా' మేకింగ్ వీడియో! - syeraa narasimha reddy making video released tomorrow

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా మేకింగ్ వీడియో రేపు సాయంత్రం 3.45 గంటలకు విడుదలకానుంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సైరా

By

Published : Aug 13, 2019, 5:15 PM IST

Updated : Sep 26, 2019, 9:27 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ బడ్జెట్​తో రూపొందుతోంది ఈ చిత్రం. నయనతార కథానాయిక. మెగాపవర్ స్టార్ రామ్​చరణ్​ నిర్మాత. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్​డేట్ విడుదల చేసింది చిత్రబృందం.

రేపు సాయంత్రం 3.45 గంటలకు 'సైరా' మేకింగ్ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం... నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

సైరా పోస్టర్

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం సహా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదలకానుంది. అందుకు తగ్గట్టే భారీ ఎత్తున ప్రమోషన్స్​ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్​. మెగాస్టార్ పుట్టినరోజైన ఆగస్టు 22న మరో సర్​ప్రైజ్​ ఇచ్చే అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, అనుష్క వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.

ఇవీ చూడండి.. సాహో వీడియో గేమ్​ విడుదల తేదీ ఖరారు

Last Updated : Sep 26, 2019, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details