తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైరాలో ఆ ఫైట్ సినిమాలోనే హైలెట్ అట! - chiru

సైరా చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాన్ని చిరు ఒక్క పూటలోనే పూర్తి చేశారని చెప్పాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలెట్​గా నిలుస్తుందని చెప్పాడు.

సైరా

By

Published : Sep 11, 2019, 5:43 AM IST

Updated : Sep 30, 2019, 4:46 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. క్లైమాక్స్​లో వచ్చే పోరాటం చిత్రానికే హైలెట్​గా నిలుస్తుందని, ఇంటర్వెల్ ఫైట్ అండర్ వాటర్ యాక్షన్స్ సీన్స్ అద్భుతంగా తీశామని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సురేందర్ రెడ్డి.

"సైరాలో పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అప్పటి వాతావరణం సహజంగా కనిపించేలా శ్రద్ధ తీసుకున్నాం. క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలెట్​గా నిలుస్తుంది. ఇంటర్వెల్​ ముందు వచ్చే యాక్షన్​ సీన్​ను అండర్ వాటర్​లో చిత్రీకరించాం. ముంబయిలోని స్విమ్మింగ్ ఫూల్​లో తీశాం. ఈ సన్నివేశం ప్రేక్షకుడిలో ఉత్కంఠను రేపుతుంది" -సురేందర్ రెడ్డి, దర్శకుడు

అండర్ వాటర్ సన్నివేశాన్ని చిరంజీవి ఒక్కరోజు మాత్రమే శిక్షణ తీసుకుని పూర్తి చేశారని చెప్పాడు సురేందర్​ దర్శకుడు.

"రెండు రోజులు పడుతుందనుకున్న సీన్​ను చిరు కేవలం ఒక్క పూటలోనే పూర్తి చేశారు. అందులో ఒక్కరోజే శిక్షణ తీసుకున్నారు. ఆయన ధీమాగా చేస్తున్నా.. మాకు మాత్రం లోపల భయం భయంగా ఉండేది. నటనపై మెగాస్టార్​కు ఉండే ఫ్యాషన్ అలాంటింది" -సురేందర్ రెడ్డి, దర్శకుడు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్​పై దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాను రామ్​చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార, తమన్నా కథానాయికలు. జగపతి బాబు, విజయ్​ సేతుపతి, సుదీప్, అనుష్క తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి: సినిమా రవిబాబుది.. విడుదల దిల్​రాజుది

Last Updated : Sep 30, 2019, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details