పర్యావరణ పరిరక్షణకి చెట్లు ఎంత ముఖ్యమో... ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని చెప్పే ప్రయత్నమే మా చిత్రం అంటున్నాడు చౌహాన్. అతడు తెరకెక్కించిన చిత్రం 'స్వేచ్ఛ'. ప్రముఖ గాయని మంగ్లీ ప్రధానపాత్రలో నటించింది. ఆంగోత్ రాజునాయక్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
వినోదం, భావోద్వేగాలతో తెరకెక్కిన 'స్వేచ్ఛ' - మంగ్లీ
సామాజిక సందేశమే కథాంశంగా రూపొందిన చిత్రం 'స్వేచ్ఛ'. ప్రముఖ గాయని మంగ్లీ ప్రధానపాత్ర పోషించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.
"ఆడపిల్ల పుడితే చాలు... అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజంలో ఉన్నాం. అలా అమ్మకానికి గురై, అభాగ్యురాలైన 'స్వేచ్ఛ' అనే యువతి కథే ఈ చిత్రం. ఆమె ఎలా బతికింది? ఏం సాధించిందనేది ఆసక్తికరం. ఆడపిల్లలు ఏ రంగంలోనూ తీసిపోరని చాటిచెప్పే ప్రయత్నం చేశాం. మంగ్లీ నటన చిత్రానికి ప్రధాన బలం. చమ్మక్ చంద్ర పాత్ర కూడా మెప్పిస్తుంది" అని అన్నాడు దర్శకుడు చౌహన్. మంగ్లీ పాత్ర నవతరం అమ్మాయిలకి ప్రేరణగా నిలుస్తుందని.. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి.. అందమైన భామలు మెచ్చే హ్యండ్బ్యాగులు