పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సువర్ణసుందరి. తాజాగా ఈ సినిమా విడుదల తేది ఖరారు చేసింది చిత్రబృందం. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. థ్రిల్లర్ ప్రధాన నేపథ్యంలో సాగే ఈ సినిమాకుఎం.ఎన్.సూర్య దర్శకుడు.
31న ప్రేక్షకుల ముందుకురానున్న సువర్ణసుందరి - movie
సువర్ణసుందరి చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థ్రిల్లర్ ప్రధానంగా తెరకెక్కించారు దర్శకుడు ఎం.ఎన్.సూర్య.
సువర్ణ
చరిత్ర భవిష్యత్తును వెంటాడుతోంది అనే క్యాప్షన్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు.
ఎస్టీమ్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ సినిమాకు ఎమ్. ఎల్ లక్ష్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిచాడు .
Last Updated : May 3, 2019, 12:04 AM IST