బాలీవుడ్ సుందరి సుస్మితా సేన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఆమె 'ఆర్య' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సిరీస్‌కు.. రామ్ మద్వానీ దర్శకుడు. చంద్రచూర్ సింగ్, సికందర్ ఖేర్, అలెక్స్ ఒనెల్, నమిత్ దాస్, మనీష్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో సుస్మిత పవర్‌ఫుల్ మహిళ పాత్రలో కనిపించారు.
'నువ్వు నన్ను నమ్ముతున్నావా ఆర్య. అన్నీ వదిలేసి నాతో వస్తావా?' అని సుస్మితను నటుడు ప్రశ్నిస్తున్న డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ఆయన్ను నమ్మి పెళ్లి చేసుకున్న సుస్మితకు కొన్నేళ్లకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. వారిద్దరి మధ్య విభేదాల సమయంలో కొందరు ఆమె భర్తను హత్య చేస్తారు? ఈ నేపథ్యంలో సాగిన ట్రైలర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. 'మనం ఎవర్ని నమ్ముతామో.. వారే మోసం చేస్తారు' అని సుస్మిత చివర్లో చెప్పారు. జూన్ 19న హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది.