Sushmita Sen: మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్, ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్ విడిపోనున్నారంటూ కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవలే సుస్మితాసేన్ స్పష్టతనిచ్చింది. రోహ్మాన్‌తో తనకున్న బంధం ముగిసిందని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
'మా బంధం ముగిసింది'.. బ్రేకప్‌పై మాజీ విశ్వసుందరి క్లారిటీ - సుస్మితాసేన్
Sushmita Sen: మోడల్ రోహ్మాన్‌తో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్. తమ మధ్య అనుబంధం ముగిసినా.. ప్రేమ అలానే ఉందని తెలిపారు.
"మా ప్రయాణాన్ని స్నేహంతో ప్రారంభించాం. ఇప్పుడు స్నేహితులుగానే విడిపోతున్నాం. మా ఇద్దరి మధ్య అనుబంధం ముగిసింది. కానీ, ప్రేమ అలానే ఉంది" అని సుస్మితాసేన్ పేర్కొంది. సుస్మితా, రోహ్మాన్ సోషల్ మీడియా వేదికగా 2018లో పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్తా రిలేషన్‌షిప్‌కి దారితీసింది. తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మాన్‌ను ఎంతగానో ఆరాధించే సుస్మిత ఈ నిర్ణయం తీసుకోవటంపై పలువురు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఎన్నేళ్లైనా తరగని అందం.. షకలక బేబి సొంతం!