బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో న్యాయం కావాలంటూ మూడేళ్ల చిన్నారి నైషా పున్మియా నిరసన తెలిపింది. రియా చక్రవర్తిని అరెస్టు చేయాలని, తన కుటుంబంతో సహా ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయం ఎదుట ఫ్లకార్టు పట్టుకుని డిమాండ్ చేసింది. సుశాంత్ తమ అభిమాన నటుడని, అతడి ధారావాహికలు, సినిమాలు చాలాసార్లు చూశామని చెప్పారు. సుశాంత్ అకాలమరణంతో కుటుంబం మొత్తం చింతిస్తున్నట్లు తెలిపారు.
సుశాంత్ కేసులో న్యాయం కోసం మూడేళ్ల చిన్నారి నిరసన - రియా చక్రవర్తి న్యూస్
సుశాంత్ కేసులో న్యాయం కావాలని, రియాను అరెస్టు చేయాలని మూడేళ్ల బాలిక డిమాండ్ చేసింది. కుటుంబంతో పాటు ఫ్లకార్డు పట్టుకుని ఎన్‌సీబీ కార్యాలయం ముందు నిరసన తెలిపింది.
యువ కథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో నటి రియా చక్రవర్తి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముందుకు ఆమె హాజరైంది. ఆదివారం, దాదాపు ఆరు గంటల పాటు ఆమెను విచారించారు. సోమవారం కూడా ప్రశ్నించనున్నట్లు ఎన్‌సీబీ తెలిపింది.
ఇప్పటికే ఈ కేసు విషయమై సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరండాతోపాటు రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి.. సెప్టెంబర్ 9 వరకు ఎన్‌సీబీ కస్టడీలోనే ఉండేలా శనివారం కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణలో భాగంగా సోవిక్ డ్రగ్స్‌తో సంబంధమున్న పలువురి పేర్లు వెల్లడించినట్లు ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు.