తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫీడ్​ఫర్​ సుశాంత్​ ప్రచారాన్ని మొదలుపెట్టిన శ్వేత - సుశాంత్

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ జ్ఞాపకార్థంగా పేదలకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలంటూ ప్రచారాన్ని మొదలుపెట్టింది హీరో సోదరి శ్వేతాసింగ్​ కీర్తి. ఆకలితో ఉన్న మనుషులు లేదా జంతువులకు ఆహారాన్ని అందించాలని ఆమె కోరింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను తీసి.. సోషల్​మీడియాలో తనను ట్యాగ్​ చేస్తూ షేర్​ చేయాలని సూచించింది.

Sushant's sister initiates #FeedFood4SSR in late actor's memory
ఫీడ్​ఫర్​ సుశాంత్​ ప్రచారాన్ని మొదలుపెట్టిన శ్వేత

By

Published : Sep 13, 2020, 1:23 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ జ్ఞాపకార్థంగా సరికొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది హీరో సోదరి శ్వేతాసింగ్​ కీర్తి. ఇందులో భాగంగా పేదలకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది శ్వేత.

"నిరాశ్రయులకు లేదా పేదలకు ఈరోజు ఆహారాన్ని అందించడానికి మనం ప్రయత్నాన్ని చేద్దాం. మనల్ని ఆ భగవంతుడు సరైన మార్గంలో నడిపించాలని.. సుశాంత్​కు న్యాయం చేయాలని ప్రార్థిద్దాం".

- శ్వేతాసింగ్​ కీర్తి, సుశాంత్​ సోదరి

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు అన్నార్తులకు లేదా జంతువులకు ఆహారాన్ని అందించాలి. 'ఫీడ్​ఫుడ్​ ఫర్ ​ఎస్ఎస్​ఆర్' అనే హ్యాష్​ట్యాగ్​ను ఉపయోగించి సోషల్​మీడియోలో ఫొటోలను పంచుకోవాలి. హీరో కుటుంబసభ్యులను ఆ పోస్టులకు ట్యాగ్​చేయాలి.

శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సుశాంత్​ అభిమానులు భాగమయ్యారు.

"నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు సుశాంత్​ సోదరి శ్వేతా.. హీరో కుటుంబసభ్యులకు ధన్యవాదాలు. ఈ రోజు నేను 20 మంది అనాథ చిన్నారులకు ఆహారం అందించాను" అని ఓ నెటిజన్​ స్పందించారు.

"నా పిల్లలు ఈరోజు సిడ్నీలో బాతులకు ఆహారాన్ని అందించారు. ఎందుకంటే అన్నార్తులకు ఆహారాన్ని అందించడానికి నగరం లోపలికి రాలేని పరిస్థితి ఉంది" అని ఆస్ట్రేలియా నుంచి ఓ నెటిజన్​ పోస్ట్​ చేశారు.

"నేను కాలిఫోర్నియాలో ఉన్న కొన్ని ఆశ్రయాలకు వెళ్లలేకపోయాను. కానీ, నేను రక్షించిన కొద్ది జంతువులు, వాటి పిల్లలను పోషించగలిగాను. ఇదంతా జంతు ప్రేమికుడైన సుశాంత్​ కోసం చేశా" అని కాలిఫోర్నియా నుంచి మరో నెటిజన్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details