'చిలసౌ' చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని హీరో సుశాంత్. వైవిధ్యభరిత కథాంశంతో చేసిన ప్రయోగం తనకు మంచి ఫలితాన్ని ఇవ్వడం వల్ల ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడీ యువ హీరో. ప్రస్తుతం సుశాంత్.. దర్శన్ అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు.
పోస్టర్‌లో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను కూడా చూపించారు. దాని హెడ్‌లైట్ పగిలినట్లుగా ఉంది. బ్యాగ్రౌండ్‌లో కొంతమంది యువకులు చేతుల్లో కర్రలు, రాడ్‌లు పట్టుకుని గుంపుగా ఉన్నట్లు కనిపించారు. ఇక ఈ చిత్రాన్ని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు పోస్టర్‌తోనే క్లారిటీ ఇచ్చేశారు.