తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా హీరో సినిమాలో అక్కినేని హీరో - allu arjun

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

సుశాంత్

By

Published : Jun 7, 2019, 12:40 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్​, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్దే హీరోయిన్. టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీలో హీరో సుశాంత్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది.

ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్​లో రెండో షెడ్యూల్ జరుపుకొంటోంది. ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈరోజు సుశాంత్ కూడా సెట్స్​లో జాయిన్​ అయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో ప్రకటించాడు.

"ఈ సినిమా గురించి ఎక్కువగా ఏమీ చెప్పలేను. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(బన్నీ), పవర్ హౌస్ టబు, నా ఫ్రెండ్ పూజ, పీఎస్ వినోద్, తమన్, మిగిలిన అద్భుత నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్‌తో పనిచేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. 'చి ల సౌ' తర్వాత నాకు ఇది మరో కొత్త ప్రయాణం. ఇంత అద్భుతమైన టీమ్ నుంచి నేను చాలా నేర్చుకుంటాననే నమ్మకంతో ఉన్నాను." -సుశాంత్ ట్వీట్

ఇది అల్లు అర్జున్ కెరీర్​లో 19వ చిత్రం కాగా.. త్రివిక్రమ్​తో మూడవది. మరి ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్​ కొడతారా అన్నది చూడాలి.

ఇవీ చూడండి.. రష్మిక-దేవరకొండ లవ్​ట్రాక్​పై మహేశ్​బాబు ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details