తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎయిమ్స్ రిపోర్ట్​పై సుశాంత్​ సోదరి సూటిప్రశ్న

సుశాంత్ రాజ్​పుత్​ శవపరీక్ష విషయంలో యూ-టర్న్​ తీసుకోవడంపై ఎయిమ్స్​ బృందం చీఫ్​ డాక్టర్​ సుధీర్​ గుప్తాను నిలదీశారు హీరో సోదరి శ్వేతా సింగ్​ కీర్తి. దీనిపై తనకు స్పష్టమైన వివరణ కావాలని సోషల్​మీడియా ద్వారా డిమాండ్​ చేశారు.

Sushant's sister wants AIIMS forensic chief to explain 'U-turn'
'యూ-టర్న్​ తీసుకోవడానికి కారణాలేంటి..వివరణ కావాలి'

By

Published : Oct 5, 2020, 3:57 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్ రాజ్​పుత్ శవపరీక్షను పరీక్షించిన ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ బృందం ఇది హత్య కాదని ఆత్మహత్య చేసుకోవడం వల్లే హీరో మరణించాడని వెల్లడించింది. అయితే ఈ విషయంపై సుధీర్​ గుప్తా నుంచి వివరణ కావాలని సుశాంత్​ సోదరి శ్వేతాసింగ్​ కీర్తి డిమాండ్​ చేశారు.

ఇన్​స్టాగ్రామ్​ ద్వారా తాను అడిగిన ప్రశ్నకు సుధీర్​గుప్తా సమాధానమివ్వాలని స్పష్టం చేశారు శ్వేతా. "ఇలాంటి యూ-టర్న్ తీసుకోవడానికి కారణాలను తప్పక వివరించాలి" అంటూ పోస్ట్​ చేశారు. ​

సుశాంత్ సోదరి ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​

ఏం జరిగిందంటే?

సుశాంత్​ మృతి వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే హీరో శవపరీక్షలో అనుమానాల కారణంగా నిజాలు తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్ధ అభ్యర్ధన మేరకు ఆగస్టులో ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ ప్యానెల్​ను ఏర్పాటు చేశారు. ఈ బృందానికి అధ్యక్షత వహించిన డాక్టర్​ సుధీర్​ గుప్తా.. సుశాంత్​ మృతదేహాన్ని పోస్ట్​మార్టం చేసిన కూపర్​ ఆస్పత్రి నివేదికపై ఆరా తీశారు.

అన్ని వివరాలను తెలుసుకున్న ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ బృందం సుశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడని.. అతనిపై ఎలాంటి విషప్రయోగం గానీ, హత్యా ప్రయత్నం గానీ జరగలేదని డాక్టర్​ సుధీర్​ గుప్తా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details