బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ఈరోజు (జులై 24) ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా హాట్స్టార్లో విడుదలై.. అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన సుశాంత్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నివాళులు అర్ఫించారు. దీనిపై సుశాంత్ పెద్దన్నయ్య నీరజ్ స్పందిస్తూ... ఈ చిత్రాన్ని మరింత ఆదరించి అతడికి ఘనమైన నివాళులు అర్పించాలని ప్రేక్షకుల్ని కోరారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.
"సుశాంత్ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలాంటిదే. ప్రతిఒక్కరు దీన్ని చూడాలని కోరుకుంటున్నా. అతడి అభిమానుల ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నా."