తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ మృతిపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్'​

నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అతని మేనమామ ప్రభుత్వాన్ని కోరారు. సుశాంత్​ మరణం వెనుక కుటుంబ సభ్యులకు చాలా అనుమానాలున్నాయని తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అని ఆయన ఆరోపించారు. ​

Sushant Singh Rajput's demise: Family alleges murder, demands CBI probe
సుశాంత్​ మృతిపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్​

By

Published : Jun 14, 2020, 9:42 PM IST

Updated : Jun 14, 2020, 11:48 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ హఠాన్మరణంతో తన స్వస్థలమైన బిహార్​లోని పట్నాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నటుడి మృతి పట్ల అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్​ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య జరిగుంటుందని అతని మేనమామ ఆరోపించారు. దీనిపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సుశాంత్​ మృతిపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్​

"ఇది హత్య. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బిహార్​ యువ సంఘం, రాజ్​పుత్​ మహాసభ డిమాండ్​ చేస్తున్నాయి. ఈ హత్యోదంతంపై దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, ప్రధాని మోదీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే సుశాంత్​ మేనేజర్​ దిశా శాలిన్​ ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు సుశాంత్​పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు".

- ఆర్​.సి. సింగ్​, సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మేనమామ

తన మేనల్లుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​తో గతంలో జరిగిన కొన్ని సంభాషణలను ఆర్​.సి.సింగ్​ వెల్లడించారు. "హీరోగా తాను ఉన్నత స్థానానికి వెళ్లాలనుకున్నాడు. దీనికోసం అతడు చాలా కష్టపడుతున్నట్లు చెప్పేవాడు. ఒక్కొక్కసారి రోజుకి 18 గంటలు పని చేసేవాడు" అని సుశాంత్​ మేనమామ తెలిపారు.

"మాధురి దీక్షిత్​తో కలిసి పాల్గొన్న ఓ డాన్స్​ ప్రోగ్రామ్​లో తనకు వెన్నునొప్పి వచ్చిందని చెప్పాడు. అయినా ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు వేచి ఉన్నానని తెలిపాడు" అంటూ సుశాంత్​ తండ్రి తరపు బంధువు ఒకరు బోరున విలపించారు.

ఇదీ చూడండి... సుశాంత్​ సింగ్​ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Last Updated : Jun 14, 2020, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details