తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన పోలీస్ స్టేషన్​కు రావాల్సిందే! - kangana ranaut on mumbai probe

సుశాంత్​ కేసుకు సంబంధించి విచారణకు నటి కంగనా రనౌత్​ ముంబయి పోలీసు స్టేషన్​లో భౌతికంగా హాజరు కావాలని పోలీసులు డిమాండ్​ చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కంగన టీమ్​.. కరోనా పరిస్థితుల కారణంగా సిమ్లా నుంచి ఆమె రావడం కుదరదని వెల్లడించింది.

Sushant Singh Rajput's death case
సుశాంత్​

By

Published : Jul 24, 2020, 9:40 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణానికి సంబంధించి.. ముంబయి పోలీసులు కంగనా రనౌత్​ను విచారణకు పిలవనున్నట్లు ఇటీవలే అధికారులు వెల్లడించారు. తాజాగా ఆమెను భౌతికంగా హాజరవ్వాల్సిందిగా పోలీసులు డిమాండ్​ చేసినట్లు తెలుస్తోంది.

కంగన పస్తుతం తన స్వస్థలమైన సిమ్లాలో నివసిస్తోంది. ముంబయి పోలీసుల డిమాండ్​పై హీరోయిన్​ అభిమాన బృందం స్పందిస్తూ.. కరోనా పరిస్థితుల వ్లల కంగన ముంబయికి రావడం సాధ్యం కాదని తెలిపారు. అంతే కాకుండా, పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడిగినా.. మెయిల్​​ ద్వారా అన్నింటికీ వివరణ ఇచ్చేందుకు ఆమెసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

సుశాంత్​ మరణించినప్పటి నుంచి అతడికి మద్దతుగా నిలుస్తోంది కంగన. చిత్రసీమలో బంధుప్రీతి వల్లే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన పలు దృశ్య సందేశాలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్​ చేసింది.

ఇప్పటికే సుశాంత్​ కేసు విచారణలో భాగంగా యశ్​రాజ్​ ఫిలింస్ అధినేత ఆదిత్యా చోప్రా, దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ సహా 39 మంది వ్యక్తుల వాంగ్ములాలను సేకరించారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details