బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై కలత చెంది బిహార్‌కు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ హీరో ఆత్మహత్య చేసుకున్న విధంగా ఈ బాలుడూ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజులుగా సుశాంత్ మరణవార్తలను చూస్తూ ఆ బాలుడు టీవీకి అతుక్కుపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తీవ్రంగా కలత చెంది శనివారం తన గదిలో ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కుటుంబసభ్యుల అభ్యర్థనతో పోస్టుమార్టం నిర్వహించలేదని అసిస్టెంట్ పోలీస్ సూపరిటెండెంట్ సర్వేస్ మిశ్రా స్పష్టం చేశారు.