యువ నటుడు సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్ బెచారా'.. ఓటీటీలో జూలై 24న విడుదలై, విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే తమ ఆరాధ్య నటుడి సినిమాను, కరోనా ప్రభావం వల్ల వెండితెరపై చూడలేకపోయామని అభిమానులు చాలా బాధపడ్డారు.
ఇప్పుడు వారికి కాస్త ఆనందం కలిగించే వార్త ఇది. ఆస్ట్రేలియాలో త్వరలో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో మన సినిమాల్ని అక్కడ విడుదల చేయనున్నారు. వీటిలో లూట్కేస్(అక్టోబరు 8), దిల్ బెచారా(అక్టోబరు 15), సడక్ 2(అక్టోబరు 22) ఉన్నాయి. దీంతో ఆ దేశంలో ఉన్న సుశాంత్ అభిమానులు సంతోషపడిపోతున్నారు.