సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును పట్నా(బిహార్) నుంచి ముంబయికి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు (బుధవారం) తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. నటుడి తండ్రి కేకే సింగ్ అభ్యర్థన మేరకు బిహార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా.. కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఓకే చెప్పింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి బిహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. అందులో రియా చక్రవర్తిని అధికారులు ఏ1గా చేర్చారు.