తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ కేసు: ఎన్​సీబీ అధికారికి కరోనా - సుశాంత్​ మాజీ మేనేజర్​ మోదీ

సుశాంత్ మృతి కేసును డ్రగ్స్​ కోణంలో విచారిస్తున్న ఓ ఎన్​సీబీ అధికారికి కరోనా సోకింది. యాంటిజెన్​ పరీక్షల్లో ఈ విషయం వెలుగు చూడగా.. బుధవారం విచారణకు వచ్చిన సుశాంత్ మాజీ మేనేజర్​ శ్రుతి మోదీని తిరిగి పంపించారు.

Sushant case: NCB probe team member tests COVID-19 positive
సుశాంత్​ కేసు: ఎన్​సీబీ అధికారికి కరోనా

By

Published : Sep 16, 2020, 1:21 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతి కేసును డ్రగ్స్​ కోణంలో విచారిస్తున్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) అధికారుల్లోని ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో బుధవారం విచారణను తొందరగా పూర్తి చేశారు. దర్యాప్తులో భాగంగా సుశాంత్​ మాజీ మేనేజర్​ శ్రుతి మోదీని కేవలం గంటసేపు మాత్రమే ప్రశ్నించి పంపించేశారు.

"సుశాంత్​ కేసును డ్రగ్స్​ కోణంలో విచారిస్తున్న మా బృందంలోని ఓ సభ్యునికి కరోనా సోకింది. యాంటిజెన్​ పరీక్షలో ఈ విషయం తెలిసింది. మిగిలిన అధికారులకు టెస్టులు చేయిస్తున్నాం. అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకోసమే ఈ రోజు విచారణకు హాజరైన శ్రుతి మోదీని తిరిగి పంపించేశాం" -ఎన్​సీబీ ప్రకటన

జయ విచారణకు రాకపోవచ్చు

సుశాంత్​ మాజీ మేనేజర్​ శ్రుతి మోదీతో పాటు టాలెంట్​ మేనేజర్​ జయ సాహాను ఎన్​సీబీ బుధవారం విచారణకు పిలిచింది. ఇప్పటికే విచారణకు శ్రుతి మోదీ హాజరవగా, ప్రస్తుత పరిస్థితుల్లో జయ సాహా రాకపోవచ్చని తెలుస్తోంది.

డ్రగ్స్​ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో నటి రియా చక్రవర్తి వాట్సప్​ సందేశాల ఆధారంగా శ్రుతి, జయలను ప్రశ్నించడానికి ఎన్​సీబీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ముంబయిలోని వాటర్​స్టాన్​ రిసార్ట్​లో సుశాంత్​, రియా బస చేసినప్పుడు జయ సాహా వీరిద్దరికీ గంజాయ్​ ఆయిల్​ అందించినట్లు వార్తలు వచ్చాయి. ఈ​ కేసులో ఇప్పటికే జయ సాహా, శ్రుతి మోదీలను సీబీఐ పలు సందర్భాల్లో విచారించింది.

ABOUT THE AUTHOR

...view details