బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత మహేశ్ భట్ వాంగ్మూలాన్ని మరో రెండు రోజుల్లో తీసుకోనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఆయనతో పాటు, కరణ్ జోహర్ మేనేజర్నూ విచారణకు పిలిచినట్లు పేర్కొన్నారు. అవసరమైతే కరణ్‌ను స్వయంగా రమ్మని కోరనున్నట్లు స్పష్టం చేశారు. నటి కంగనా రనౌత్కూ సమన్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
సుశాంత్ మృతి కేసులో విచారణకు మహేశ్ భట్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ వాంగ్మూలాన్ని ముంబయి పోలీసులు రెండు రోజుల్లో తీసుకోనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఆయనతో పాటు కరణ్ జోహర్ మేనేజర్‌ను విచారణకు రమ్మని చెప్పినట్లు స్పష్టం చేశారు.
సుశాంత్ మృతి కేసులో విచారణకు మహేశ్ భట్
సుశాంత్ చనిపోవడానికి అతని వృత్తిపరంగా ఎటువంటి కారణాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్ సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు.
మరోవైపు ఇటీవలే డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైన సుశాంత్ ఆఖరి చిత్రం 'దిల్ బెచారా' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.