తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వడ్డీలోడు వసూల్ చేయడానికి వస్తున్నాడు' - HERO

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ఎన్​జీకే.  ఈ సినిమాలో 'వడ్డీలోడు వచ్చేనే' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. రకుల్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూర్య

By

Published : Apr 12, 2019, 6:52 PM IST

సూర్య నటించిన 'ఎన్​జీకే' చిత్రంలో లిరికల్ సాంగ్ విడుదలైంది. 'వడ్డీలోడు వచ్చేనే' అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటోంది. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైందీ పాట. రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే సూర్య 'గ్యాంగ్' సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్​జీకే' చిత్రంలో నటిస్తున్నాడు.

శివపుత్రుడు, గజిని, సింగం సిరీస్, వీడొక్కడే, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి చిత్రాలతో తెలుగులోనూ అభిమానుల్నీ సంపాదించుకున్నాడీ కోలీవుడ్ హీరో. సూర్య సోదరుడు కార్తీ కూడా హీరోగా రెండు భాషల్లో రాణిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details