తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రీమేక్ మల్టీస్టారర్​లో సూర్య, కార్తి! - సూర్య, కార్తి కలిసి అయ్యప్పయుమ్‌ కోషియమ్

కోలీవుడ్​ రియల్​ లైఫ్​ బ్రదర్స్​ సూర్య, కార్తి కలిసి మల్టీస్టారర్​ చిత్రం చేయనున్నట్లు టాక్​. మలయాళ సూపర్​ హిట్​ చిత్రం 'అయ్యప్పయుమ్‌ కోషియుమ్‌' తమిళ రీమేక్‌లో వీరిద్దరు నటించనున్నట్లు సమాచారం.

surya, karthi
సూర్య, కార్తి

By

Published : May 29, 2020, 6:31 AM IST

ఏ చిత్ర పరిశ్రమలోనైనా రియల్​ లైఫ్​ బ్రదర్స్​ ​కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ అభిమానుల కలని నిజం చేసేందుకు కోలీవుడ్​ స్టార్​ బ్రదర్స్​ సూర్య, కార్తి సిద్ధమయ్యారని టాక్​. ఈ సోదరులిద్దరికి తమిళ నాట ఎంత క్రేజ్‌ ఉందో.. తెలుగులోనూ అదే స్థాయి గుర్తింపు ఉంది.

మలయాళ సూపర్​ హిట్‌ చిత్రం 'అయ్యప్పయుమ్‌ కోషియుమ్‌'ను తమిళంలో రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈ చిత్ర తమిళ హక్కులను ఈ బ్రదర్స్​ సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే హిందీ రీమేక్‌ హక్కులను జాన్‌ అబ్రహం సొంతం చేసుకోగా.. తెలుగులోనూ ఈ చిత్ర రీమేక్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి : షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు: తలసాని

ABOUT THE AUTHOR

...view details