ప్రముఖ తమిళ నటుడు సూర్య సరసన మాళవిక మోహన్ నటిస్తుందంటూ గతంలో వార్తలొచ్చాయి. కానీ, ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
'సింగం' సిరీస్ దర్శకుడు హరి తెరకెక్కించనున్న సినిమాలో ముందుగా 'మాస్టర్' ఫేం మాళవికను ఎంపిక చేశారు. కొన్ని కారణాలతో ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకుందని సమాచారం. ఇప్పుడీ అవకాశం రష్మికకు దక్కిందని టాక్. ఇదే నిజమైతే అటు సూర్య, ఇటు కార్తీ ఇద్దరి సినిమాల్లోనూరష్మిక అవకాశం దక్కించుకున్నట్లే.