తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రిలీజ్​ డేట్స్​తో షారుక్​, వరుణ్​.. ఆ హీరోకు 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​ థ్యాంక్స్​ - షారుక్​ పఠాన్​ మూవీ రిలీజ్​ డేట్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో షారుక్​ 'పఠాన్​', వరుణ్​ 'గని', సూర్య 'ఈటీ', శివకార్తికేయన్​ 'డాన్'​, విశ్వక్​సేన్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం', శర్వానంద్​ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాల సంగతులు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

sharukh pathan release date
షారుక్​ పఠాన్ రిలీజ్​ డేట్​

By

Published : Mar 2, 2022, 12:17 PM IST

Sharukh Khan pathan movie release date: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్​ స్టార్​ షారుక్​ ఖాన్ 'పఠాన్'​ సినిమా రిలీజ్​ డేట్​ ఖరారైంది. 2023 జనవరి 25న థియేటర్లలో కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్.

Gani Movie Release date: వాయిదా పడుతూ వస్తున్న మెగాహీరో వరుణ్​తేజ్​ 'గని' కొత్త రిలీజ్​ డేట్​ ఖరారైపోయింది. ఏప్రిల్​ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాహీరో వరుణ్​తేజ్​ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు.

Suriya ET trailer: 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్‌' చిత్రాలతో హీరో సూర్య.. ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'ఈటీ'తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 10న ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్​ హీరోయిన్​గా నటించింది.

విడుదల వాయిదా

శివకార్తికేయన్​కు 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​ థ్యాంక్స్​

'రెమో', 'వరుణ్‌ డాక్టర్‌' వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరైన కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ నటించిన సరికొత్త చిత్రం 'డాన్‌'. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ కామెడీ డ్రామాను మార్చి 25న విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కూడా మార్చి 25న ‘రిలీజ్​ కానుంది. దీంతో, 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను దృష్టిలో ఉంచుకుని 'డాన్‌' రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేస్తున్నామని శివకార్తికేయన్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. మే 13న 'డాన్‌'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.. శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టింది. "మాపై ఎప్పుడూ ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తుల్లో మొట్టమొదట ఉండే శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేసింది.

Viswaksen movie postpone: యువ హీరో విశ్వక్​ సేన్​ నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా రిలీజ్​ డేట్​ వాయిదా పడింది. సోషల్​మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసిన చిత్రబృందం.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

విశ్వక్​ సేన్​ 'అశోకవనంలో అర్జున కళ్యాణం'

Sarvanand Rashmika Adavallu meeku joharlu: శర్వానంద్​, రష్మిక నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా నుంచి 'ఓ మై ఆద్యా' సాంగ్​ రిలీజ్​ అయి ఆకట్టుకుంటోంది. మార్చి 4న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: బీచ్​లో తారల స్టన్నింగ్​ లుక్స్​!

ABOUT THE AUTHOR

...view details