తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య? - సూర్య కేవీ ఆనంద్ సినిమా వార్తలు

హీరో సూర్య తనకు 'అయన్', 'మాత్రాన్' వంటి హిట్​లు ఇచ్చిన కేవీ ఆనంద్​తో మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. వీరిద్దరి మధ్య ఇప్పటికే కథా చర్చలు సాగుతున్నాయని సమచారం.

సూర్య
సూర్య

By

Published : May 18, 2020, 12:32 PM IST

హీరో సూర్య, కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో గతంలో 'అయన్‌', 'కప్పాన్‌', 'మాత్రాన్‌'లాంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో 'బ్రదర్స్', 'బందోబస్తు' రాణించాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆనంద్‌-సూర్యలు కలిసి ఓ కొత్త చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మళ్లీ కొత్త కథ కంటే గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ చిత్రం అయన్‌కే కొనసాంగిపుగా సినిమా చేస్తే బాగుంటుందని సూర్య అభిమానులు కోరుకుంటున్నారట.

ప్రస్తుతం సూర్య.. సుధ కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' చిత్రం చేస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే సింగం దర్శకుడు హరితోనూ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు సూర్య. మరో తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తోను ఓ చిత్రం చేయనున్నారు. ఈవిధంగా చూస్తే వీరందరి చిత్రాలు అయిపోయిన తర్వాతనే దర్శకుడు ఆనంద్‌కి అవకాశం రావచ్చని చెప్పుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details