తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెంకటేశ్​ మల్టీస్టారర్​ చిత్రంపై క్లారిటీ - మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి

తమిళ నటులు మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం 'విక్రమ్​ వేధ'. కోలీవుడ్​లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్​లో వెంకటేశ్, నారా రోహిత్​ రీమేక్​ చేస్తున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చింది సురేష్​ ప్రొడక్షన్స్​ సంస్థ.

వెంకటేశ్​ మల్టీస్టారర్​ చిత్రంపై క్లారిటీ

By

Published : May 7, 2019, 3:35 PM IST

ప్రముఖ ద‌ర్శ‌క ద్వయం పుష్క‌ర్ - గాయ‌త్రి తెర‌కెక్కించిన చిత్రం 'విక్ర‌మ్ వేధ'. భేతాళ క‌థ‌ల‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ తమిళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందని సోషల్​ మీడియాలో కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీవీ వినాయక్​ దర్శకత్వంలో వెంకటేశ్, నారా రోహిత్ కలిసి ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

"విక్ర‌మ్ వేధ తెలుగు రీమేక్‌లో వెంకీ న‌టిస్తారనేది అవాస్త‌వం. ప్ర‌స్తుతం ఆయన 'వెంకీ మామ' అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. వెంకీ త‌దుప‌రి ప్రాజెక్టుల‌కు సంబంధించిన విషయాలను త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్లడిస్తాం"
-సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ ట్వీట్​

ఇటీవల సినిమాలపై ఎలాంటి పుకార్లు వచ్చినా వెంటనే ట్విట్టర్​ ద్వారా స్పందిస్తున్నారు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు. పవన్​కళ్యాణ్​ సినిమా చేస్తున్నారని, పూజా హెగ్దే భారీ రెమ్యునరేషన్ తీసుకుందంటూ వార్తలు రాగా దర్శకుడు హరీశ్ ​శంకర్​ సామాజిక మాధ్యమం వేదికగా ఇలాగే క్లారిటీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details