సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటుతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. రజినీకి బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు.
రజినీకాంత్‌కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్ - superstar rajini kanth news
13:08 December 25
అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్
రజినీకి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని... ఈ నెల 22 న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని అపోలో వైద్యులు వివరించారు. బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయని... అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రజినీకాంత్‌కు బీపీ తప్ప... మరే ఇతర ఇబ్బందులు ఏమీలేవని వైద్యులు స్పష్టం చేశారు. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేవరకూ పర్యవేక్షణలో ఉంచుతామని.. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ను డిశ్చార్జి చేస్తామని ప్రకటించారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నత్తై చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.
పవర్‌స్టార్ స్పందన
రజినీకాంత్ అస్వస్థత చెందటంపై పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ స్పందించారు. ఆస్పత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డానని పవన్ తెలిపారు. కరోనా లక్షణాలు లేవని తెలపడం ఊరటనిచ్చిందన్న పవన్... సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గవర్నర్ ఆకాంక్ష
రజినీకాంత్ ఆరోగ్యం గురించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై అడిగి తెలుసుకున్నారు. అపోలో వైద్యులతో మాట్లాడిన సూపర్ స్టార్ ఆరోగ్యం వివరాలపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి :క్రిస్మస్ వేడుకల్లో 'మెగా' కజిన్స్