తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ ఫిట్​నెస్​కు అవార్డు.. అందం, ఆరోగ్యంలో భేష్​ - mahesh

మహేశ్​బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మాయిల్లో అతడికున్న క్రేజ్​ మాటల్లో చెప్పలేం. నటనలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న సూపర్​స్టార్​.. ఇప్పుడు అందం, ఆరోగ్యానికీ ఓ అవార్డు దక్కించుకున్నారు. గ్లోబల్​ స్పా మేగజిన్​ మహేశ్​ను 'ఫిట్​ అండ్ ఫాబ్​ వెల్​నెస్ ఐకాన్​'గా గుర్తించింది.

superstar mahesh babu  receives Synth Global Spa Fit & Fab Wellness Icon Award
మహేశ్​ ఫిట్​నెస్​కు అవార్డు.. అందం, ఆరోగ్యంలో భేష్​

By

Published : Mar 17, 2021, 5:40 AM IST

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు మరో అవార్డు గెలుచుకున్నారు. అయితే అది నటనలో కాదు. అందం, ఆరోగ్యంలో. గ్లోబల్ స్పా వెల్​నెస్ అండ్​ లైఫ్​స్టైల్ మేగజిన్ మహేశ్​ను 'ఫిట్​ అండ్ ఫాబ్​ వెల్​నెస్ ఐకాన్​'గా గుర్తించింది.

"ప్రయాణించాల్సింది ఫిట్​నెస్​ మార్గంలోనే. అది అంత సులభం కాదు. కానీ అసాధ్యం కూడా కాదు. సింత్ గ్లోబల్ స్పా ఫిట్​ అండ్ ఫాబ్ వెల్​నెస్ ఐకాన్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. గ్లోబల్​ స్పాకు ధన్యవాదాలు."

- మహేశ్ బాబు, సినీ నటుడు

ప్రస్తుతం మహేశ్​ 'సర్కారు వారి పాట' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో మహేశ్​ ఓ సినిమా చేయబోతున్నారు.

ఇదీ చూడండి:'ఆ లోటును తర్వాతి చిత్రంతో తీరుస్తా'

ABOUT THE AUTHOR

...view details