సూపర్‌స్టార్ కృష్ణ అంటే ఆయన నటించిన అద్భుత సినిమాలతో పాటు ప్రయోగత్మక కథలు గుర్తొస్తాయి. మన చిత్రసీమకు తొలి సినిమా స్కోప్ , తొలి 70 ఎంఎం, మొట్టమొదటి డీటీఎస్(DTS), తొలి జేమ్స్ బాండ్(james bond), తొలి కౌబాయ్(cowboy) సినిమాల్ని తీసుకొచ్చిన ఘనత కృష్ణకే దక్కింది. వీటిలో ఒకటైన 'మోసగాళ్లకు మోసగాళ్లు'.. విడదలై శుక్రవారానికి 50 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్రం వెనుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం.
హాలీవుడ్ చిత్రాల నుంచి పుట్టిన ఆలోచన
'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'మెకన్నాస్ గోల్డ్', 'ట్రెజర్ ఐలాండ్' లాంటి హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో 'మోసగాళ్లు మోసగాళ్లు' కథను ఆరుద్ర రాశారు. అప్పట్లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే వస్తుండటం వల్ల కొత్తదనం కావాలనుకున్న కృష్ణ.. ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. తన పద్మాలయా నిర్మాణ సంస్థలో దీనిని నిర్మించారు.
కథేంటంటే..
బొబ్బిలి యుద్ధ సమయంలో బ్రిటీష్ వారికి దక్కకుండా జమీందారులు తమ సంపదను ఓ చోట దాస్తారు. ఆ గుట్టు తెలిసిన కొత్వాల్‌ను నిధి రహస్యం చెప్పమని చంపేస్తారు. ధర్మం కోసం పోరాడే కొత్వాల్ కుమారుడు కృష్ణప్రసాద్.. ఈ విషయం తెలుసుకుని వారిని అంతమొందిస్తాడు. ఇలా పూర్తిగా యాక్షన్ అడ్వెంచరెస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించారు.
ఎడారుల్లో ఖర్చుకు భయపడకుండా..