తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సూపర్​ 30'తో హృతిక్ సూపర్ హిట్​ కొడతాడా..?

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిన్ రోషన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'సూపర్ 30'. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్

By

Published : Jul 12, 2019, 6:53 AM IST

Updated : Jul 12, 2019, 10:44 AM IST

బాలీవుడ్‌ నుంచి మరో జీవిత కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన 'సూపర్‌ 30' ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 'క్వీన్‌' దర్శకుడు వికాస్‌ భల్‌ తెరకెక్కించాడు.

హృతిక్‌ రోషన్‌ తెరపై కనిపించి రెండున్నరేళ్లు కావస్తోంది. 2017 జనవరిలో వచ్చిన 'కాబిల్‌' తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ 'సూపర్‌ 30'తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కథేంటి..

బిహార్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ కుమార్‌.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకునే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడకు చేరలేకపోతాడు. సొంత ఊరిలోనే ట్యూషన్లు చెబుతూ బతుకు తెరువు కోసం అప్పడాలు అమ్ముతాడు. గణితంలో అపారమైన ప్రతిభ ఉన్న ఆనంద్‌ కుమార్‌ రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు ప్రతిష్ఠాత్మకమైన జర్నల్స్‌లో ప్రచురితమవుతాయి. ఆ తర్వాత ఆయన తన లాంటి పేద విద్యార్థులకు ఐఐటీలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు 'సూపర్‌ 30' కోర్సును ప్రారంభిస్తాడు. గణితమంటే గ్రామీణ విద్యార్థుల్లో ఉండే భయాన్ని పటాపంచలు చేసేలా వినూత్నమైన బోధనా విధానంతో వారిని మెరికల్లా తయారు చేస్తాడు. ఏటా ఆయన వద్ద శిక్షణ తీసుకున్న వారు ఐఐటీల్లో జయకేతనం ఎగురవేస్తుంటాడు. దీంతో ఆనంద్‌ కుమార్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఎన్నో పురస్కారాలుఆయనను వరిస్తాయి. టైమ్స్‌ మేగజైన్‌ జాబితాలోనూ స్థానం సంపాదించుకుంటాడు. ఆ కథనే స్ఫూర్తిరగిలించేలా తెరపై ఆవిష్కరించినట్లు చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉండగా దర్శకుడు వికాస్‌ భల్‌ 'మీ టూ' ఆరోపణల్లో చిక్కుకున్నాడు. 'క్వీన్‌' సమయంలో వికాస్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ సినిమా కథానాయిక కంగనా రనౌత్‌ ఆరోపించింది. ఫలితంగా 'సూపర్‌ 30' దర్శకుడిగా వికాస్‌ పేరును తొలగించాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత వికాస్‌కు ఆ వివాదంలో క్లీన్‌ చిట్‌ లభించగా.. ఆయన్నే దర్శకుడిగా కొనసాగించారు.

ఇవీ చూడండి.. కురుక్షేత్ర: 'అర్జునుడి' పాత్రలో సోనూసూద్

Last Updated : Jul 12, 2019, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details