నటుడు సునీల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. 'మర్యాదక్రిష్ణయ్య'గా పేరుతో ఉన్న పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కిశోర్ గరికపాటి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ప్రేమకథా చిత్రం 'లవ్‌స్టోరి'. ఇందులోని 'సారంగధరియా' గీతాన్ని ముద్దుగుమ్మ సమంత విడుదల చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్ 16న రానుంది.