టాలీవుడ్ యువహీరో సందీప్ కిషన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే 'నిను వీడని నీడను నేనే' అంటూ భయపెట్టాడు. త్వరలో 'తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి' అంటూ నవ్వించబోతున్నాడు. అంతలోనే హాకీ నేపథ్యమున్న'A1 ఎక్స్‌ప్రెస్' చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్లో ఈ క్రీడకు సంబంధించి రూపొందుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
అలాంటి కథతో వస్తున్న తొలి తెలుగు సినిమా - SUNDEEP KISHAN LOOK IN A1 EXPRESS CINEMA
హాకీ నేపథ్య కథతో రూపొందుతోన్న 'A1 ఎక్స్‌ప్రెస్' లుక్ విడుదలైంది. సందీప్‌కిషన్ హీరో. ఈ క్రీడపై రానున్న తొలి తెలుగు సినిమా ఇదే.
అలాంటి కథతో వస్తున్న తొలి తెలుగు సినిమా
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఆమెతో పాటు ఇతర నటీనటులు వివరాలు త్వరలో వెల్లడిస్తారు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించనున్నాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయ పన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: తారక్-చరణ్‌ల 'ఆర్ఆర్ఆర్' పూర్తి టైటిల్ ఇదేనా..!