టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు.. ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం భిన్నమైన, కష్టంగా ఉండే కసరత్తులు చేసి వాటిని అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఎంట్రీ సీన్లో.. సుధీర్‌పై ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. సిక్స్ ప్యాక్‌తో చేతిలో తుపాకీ పట్టుకొని ప్రత్యర్థులపై విరుచుకుపడతారు.
తాజాగా ఆ సన్నివేశం చిత్రీకరణలో రెండు డంబుల్స్ పట్టుకొని వర్కౌట్ చేసిన ఫొటోలను.. ట్విట్టర్ పోస్ట్ చేశారు సుధీర్. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ స్టిల్స్... నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.