గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత - సుద్దాల అశోక్ తేజకు అస్వస్థిత
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయనకి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది.
సొంత ఊరు సుద్దాలని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈయన 'నమస్తే అన్న' చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకు పరిచయమయ్యారు. సినీ నటుడు ఉత్తేజ్‌కు సుద్దాల మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ల భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించారు.