సినిమాల్లో నటుడిగా విజయం సాధించినా.. జాతివివక్ష విషయంలో మాత్రం ఓడిపోయానని అంటున్నాడు హాలీవుడ్ ప్రముఖ నటుడు ఇడ్రిస్ ఎల్బా. నలుపుగా ఉన్న కారణంగా చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పాడు. ఇటీవలే అమెరికాలోని పోలీసుల వల్ల జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు చనిపోయిన నేపథ్యంలో, ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం జరిగిన 'ద రెకానింగ్: ద ఆర్ట్స్ అండ్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అనే కార్యక్రమంలో మాట్లాడిన ఇడ్రిబ్.. ఈ విషయాల్ని పంచుకున్నాడు.
"నేను సాధించిన విజయాలు, నాపై జాత్యంహకారాన్ని ఆపలేకపోయాయి. ఒకవేళ 'రేసిజమ్' గురించి నన్ను అడిగితే, నువ్వు ఎంతకాలం నుంచి బతికున్నావు అని అడిగినట్లే. జీవితంలోపైకి రావాలంటే తెల్లవాడి కంటే రెండురెట్లు కష్టపడాలని నాతో తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుండేవారు" అని ఇడ్రిస్ ఎల్బా వివరించాడు.