తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్పీల్​బర్గ్ డిగ్రీ పూర్తి చేసింది ఎప్పుడో తెలుసా! - స్పీల్​బర్గ్ సినిమాలు

స్టీవెన్ స్పీల్​బర్గ్​.. సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు. ఎన్నో సృజనాత్మక చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారీయన. అయితే ఈ దర్శకుడి డిగ్రీ ఎప్పుడు పూర్తయిందో తెలుసా!

స్పీల్​బర్గ్ డిగ్రీ పూర్తి చేసింది ఎప్పుడో తెలుసా!
స్పీల్​బర్గ్ డిగ్రీ పూర్తి చేసింది ఎప్పుడో తెలుసా!

By

Published : Jul 17, 2020, 7:58 PM IST

చదువు ఉద్యోగం కోసం కాదు... జ్ఞానం కోసం! ఈ మాటను ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ చేతల్లో నిరూపించారు. అంతర్జాతీయంగా కాసుల పంట పండించిన ఎన్నో సినిమాలు స్పీల్‌బర్గ్‌ సృజనాత్మకతతో రూపొందినవే.

'జాస్‌', 'ఇ.టి', 'ఇండియానా జోన్స్‌', 'క్లోజ్‌ ఎన్​కౌంటర్స్‌ ఆఫ్‌ థర్డ్‌ కైండ్‌', 'జురాసిక్‌ పార్క్‌' లాంటి సినిమాలతో ప్రపంచంలోని సంపన్నులలో ఒకరయ్యారు స్పీల్‌బర్గ్‌. అలాంటి స్పీల్‌బర్గ్‌ తన డిగ్రీని ఎప్పుడు పూర్తి చేశారో తెలుసా? చదువును ఆపేసిన 33 ఏళ్ల తర్వాత.!

చదువును మధ్యలోనే మానేసి సినిమా రంగంలోకి వచ్చిన స్పీల్‌బర్గ్‌కి ఎంత బిజీగా ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా చదువుకోలేదనే లోటు మనసులో ఉండేది. దాంతో ఆయన 'షిండ్లర్స్‌ లిస్ట్‌' ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక చదవుకుని డిగ్రీ పొందారు.

ABOUT THE AUTHOR

...view details