తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వేశ్య పాత్రని ఒకరు..రేపిస్ట్‌ రోల్​ అని మరొకరు - Radhika Apte latest news

తాను నటించిన కొన్ని సినిమాలు చూసి అదే తరహా పాత్రలతో కొందరు దర్శక-నిర్మాతలు తనదగ్గరకు వస్తున్నారని హీరోయిన్ రాధికా ఆప్టే ఆవేదన చెందుతోంది. వేశ్య పాత్రని ఒకరు, రేపిస్ట్​ రోల్ కోసమని మరొకతను వచ్చారని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

వేశ్య పాత్రని ఒకరు..రేపిస్ట్‌ రోల్​ కోసమని మరొకరు
హీరోయిన్ రాధికా ఆప్టే

By

Published : Dec 5, 2019, 5:08 PM IST

బోల్డ్ సీన్లలో నటించడం చూసిన చాలా మంది దర్శక, నిర్మాతలు ఆ తరహా పాత్రలతోనే తనను సంప్రదిస్తున్నారని ఆవేదన చెందుతోంది హీరోయిన్ రాధికా ఆప్టే. తెలుగులో 'రక్తచరిత్ర', 'లయన్' వంటి సినిమాల్లో పద్ధతైన పాత్రల్లో కనిపించిన ఈ భామ.. బాలీవుడ్​లో మాత్రం 'బద్లాపూర్', 'లస్ట్​ స్టోరీస్', 'వెడ్డింగ్ గెస్ట్', 'అహల్య' వంటి చిత్రాల్లో బోల్డ్​గా నటించి మెప్పించింది. అయితే ఈ ముద్రను చెరిపేసుకుందామని ఎంత ప్రయత్నించినా వీలు పడటం లేదని చెబుతోంది. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీటితో పాటే మరిన్ని విషయాలను పంచుకుంది.

హీరోయిన్ రాధికా ఆప్టే

"ఇటీవల ఓ దర్శకుడు కథ చెప్తానని నా దగ్గరకొచ్చారు. నాది ఓ వేశ్య పాత్ర అని చెప్పి కథ వివరించబోయారు. ఎందుకీ పాత్ర ఇస్తున్నారని అడిగితే.. 'బద్లాపూర్‌', 'అహల్య' చిత్రాల్లో ఆ తరహా పాత్రల్లోనే నటించారు కదా. అదే కాకుండా ఇటీవల మీరు చేసిన చిత్రాలన్నీ అలానే ఉన్నాయి కదా' అని చెప్పారు. నేను షాక్‌ అయ్యా. మరో దర్శకుడు.. దేశంలోని అత్యాచారాలపై సినిమా తీస్తున్నాని చెప్పి అందులో నా పాత్ర గురించి వివరించాడు. నేను ఓ అత్యాచార బాధితురాలిగా కనిపిస్తానని, నాపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన వారిపై పగ తీర్చుకునే క్రమంలో ఓ రేపిస్టుగా మారిపోతానని ఓ దరిద్రపు కాన్సెప్ట్‌ను చెప్పారు. కథ నచ్చక వెంటనే వద్దనేశా. 'వెడ్డింగ్‌ గెస్ట్‌'లో బోల్డ్‌ సీన్స్‌ చేశా. నన్ను కొన్ని చోట్ల మాత్రమే నగ్నంగా చూపించారు. ఇలాంటి పాత్రల వల్ల కేవలం సెక్స్‌ సీన్లున్న పాత్రల్లోనే చేస్తానని చాలా మంది పొరబడుతున్నారు" -రాధికా ఆప్టే, హీరోయిన్

తాను బోల్డ్‌ పాత్రలు చేస్తాను కానీ, ప్రాధాన్యత లేకుండా కేవలం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కోసం అలాంటి పాత్రలు చేయనని తెగేసి చెప్పింది రాధిక.

ఇది చదవండి: అవార్డులొస్తే ఆనందమే.. కానీ ఆసక్తి లేదు: రాధికా ఆప్టే

ABOUT THE AUTHOR

...view details